శంకర్‌పల్లి: అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఓ టిప్పర్ గుర్తు తెలియని వృద్ధుడిని ఢీ కొట్టడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శంకర్‌పల్లి సీఐ ముదస్సర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం చేవెళ్ల నుంచి ఎరువు లోడ్‌తో శంకర్‌పల్లి వైపు నుంచి ఎన్కెతలకు వెళ్తున్న ఓ టిప్పర్ అతివేగంగా వెళ్తుంది. శంకర్‌పల్లి మున్సిపాలిటీలోని ఫత్తేపూర్ వద్ద టిప్పర్ యూటర్న్ తీసుకునే క్రమంలో అక్కడే రోడ్డు దాటుతున్న ఓ గుర్తు తెలియని వృద్ధుడు(80)ని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడికి రక్తగాయాలు కావడంతో స్థానికులు 108సాయంతో హుటాహుటిన సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


