ఫిట్‌నెస్‌ మస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ మస్ట్‌

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

పాటించాల్సిన నిబంధనలు

బడి బస్సు..
కొద్దిరోజుల్లో తెరుచుకోనున్న పాఠశాలల గేట్లు

షాద్‌నగర్‌లో ఫిట్‌నెస్‌ టెస్ట్‌కు వచ్చిన బస్సును పరిశీలిస్తున్న అధికారులు

షాద్‌నగర్‌: మరికొద్ది రోజుల్లో పాఠశాలల గేట్లు తిరిగి తెరుచుకోనున్నాయి. స్కూళ్లు ప్రారంభం అయ్యే నాటికి ప్రైవేటు యాజమాన్యాలు బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకొని ధ్రువపత్రాలు పొందాల్సి ఉంటుంది. ఎంవీఐ కార్యాలయాల్లో ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గడువులోపు ప్రైవేటు పాఠశాలల బస్సులకు విధిగా ఫిట్‌నెస్‌ టెస్ట్‌ చేయించాలి. జిల్లాలో సుమారు రెండువేల వరకు ఈ బస్సులు ఉన్నాయి. పాఠశాలలు తిరిగి ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫిట్‌నెస్‌ ఉంటేనే బస్సులు రోడ్లపై తిరగాలని లేదంటే సీజ్‌ చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రైవేటులో ప్రత్యేకంగా బస్సులు

ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. విద్యార్థులను నేరుగా ఇంటి నుంచి తీసుకెళ్లి, తిరిగి సాయంత్రం విడిచి పెట్టేందుకు వీలుగా బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ, గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకొచ్చేందుకు చాలా ప్రైవేటు పాఠశాలలు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఇందుకు గాను ప్రత్యేకంగా రవాణా చార్జీల పేరిట వసూలు చేస్తున్నారు.

పాఠశాల బస్సు 15 ఏళ్ల కాలపరిమితి దాటకూడదు.

విద్యాసంస్థల బస్సులు విధిగా పసుపు రంగులోనే ఉండాలి.

బస్సు నడిపే డ్రైవర్‌ విధిగా హెవీ వెహికిల్‌ లైసెన్స్‌ ఉండాలి.

డ్రైవర్‌ వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలి. బస్సు నడిపేందుకు ఐదేళ్ల అనుభవం ఉండాలి.

బస్సుపై కుడి, ఎడమ వైపు పాఠశాల పేరు, చిరునామా స్పష్టంగా రాయాలి.

వాహనం ఆగితే బ్లింక్‌ అయ్యేలా పై భాగంలో నాలుగు వైపులా అంబర్‌ లైట్లు ఉండాలి

డ్రైవర్‌ లైసెన్స్‌ను పాఠశాల యాజమాన్యం విధిగా ఆర్‌టీఏ కార్యాలయంలో అందించాలి.

బస్సులో ప్రథమ చికిత్స పెట్టె, మంటలను ఆర్పే వ్యవస్థ ఉండాలి.

కిటికీలకు అడ్డంగా మూడు కడ్డీలు ఉండాలి.

నేల నుంచి 325 మి.మీ ఎత్తులో మెట్లు, ఎక్కేందుకు హ్యాండ్‌ రెయిలింగ్‌ ఉండాలి.

అత్యవసర ద్వారంతోపాటు బస్సు డ్రైవర్‌, అటెండర్‌ ఫోన్‌ నంబర్లు విఽధిగా ఉండాలి.

నెలకోసారి బస్సు డ్రైవర్‌కు బీపీ, షుగర్‌, కంటి పరీక్షలు విఽధిగా చేయించాలి.

ప్రతి బస్సులో సీరియల్‌ నంబర్‌తో కూడిన ఫిర్యాదుల పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలి.

స్కూల్‌ యాప్‌ ద్వారా విద్యా సంస్థ పేరు, డ్రైవర్‌, అటెండర్‌ పేరు వివరాలు పొందుపర్చాలి.

బస్సులు రోడ్డెక్కాలంటే అనుమతి తప్పనిసరి

యాజమాన్యాలు విధిగా పరీక్షలు చేయించాలి

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement