పింఛన్‌ రాక.. ఆశతీరక | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ రాక.. ఆశతీరక

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

సర్కారు ‘చేయూత’కోసం కొత్తవారి చింత

దౌల్తాబాద్‌: మూడేళ్లుగా కొత్త పింఛన్ల కోసం అర్హులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం మృతి చెందిన వారి స్థానంలో తదనంతరం అర్హులైన వారికి వింతంతు పింఛన్లు అందుతున్నాయి. మిగతావి కొనసాగుతున్నాయి. అర్హులైన వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్న అధికారుల సూచనలతో.. మండల పరిధి నుంచి వందల మంది చేయూత కోసం అర్జీ పెట్టుకున్నారు. తమ వంతుకోసం ఆశగా.. పంచాయతీ, ఎంపీడీఓ, మీసేవ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ.. ఆరాతీస్తున్నారు.

వివరాల సేకరణ..

మండలంలో ప్రస్తుతం పింఛన్‌ దారుల వివరాలను ముఖ గుర్తింపు యాప్‌లో నమోదు చేస్తున్నారు.మృతి చెందిన, వలస వెళ్లిన వారితో పాటు.. కొత్తగా అర్హులైన వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. అనంతరం గ్రామసభ నిర్వహించి, లేని వారి పేర్లను సభ ఆమోదంతో తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు కొత్త వారి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

దరఖాస్తుల స్వీకరణ

ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను పరిశీలించడంతో పాటు.. ఇంకా అర్హులైన వారుంటే దరఖాస్తులు తీసుకోవాలని ఎంపీడీఓలు ఇటీవల పంచాయతీ కార్యదర్శులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకునే పనిలో కార్యదర్శులు బిజీగా ఉన్నారు. మండలంలో ఇప్పటి వరకు 2,358 వద్ధాప్య, 2,414 వితంతు, 668 వికలాంగులు, 59 చేనేత, 42 గీత కార్మికులు, 289 ఒంటరి మహిళలు పింఛన్లు పొందుతున్నారు.

ఇవీ అర్హతలు

వృద్ధాప్య పింఛన్‌కు 57 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆధార్‌, ఓటరు ఐడీ, రేషన్‌కార్డు, ఆదాయ ధ్రువపత్రం, బ్యాంకు పాసుపుస్తకం కలిగి ఉండాలి. వితంతువుకు 18 ఏళ్లు నిండి భర్త మరణ ధ్రువీకరణ పత్రం జత చేయాలి. దివ్యాంగులకు వయోపరిమితి లేదు. కానీ 40శాతం పైగా వైకల్యం ఉండాలి. సదరం సర్టిఫికెట్‌, యూడీఐడీ కార్డు, ఆదాయ ధ్రువపత్రం ఉండాలి. చేనేత, గీత కార్మికులు 50 ఏళ్లు నిండి ఉండాలి. సంబంధిత సొసైటీ గుర్తింపుకార్డు, ఆదాయ ధ్రువపత్రం తప్పనిసరి.

ఆందోళనలో అర్హులు

మూడేళ్లుగా పడిగాపులు

Advertisement
 
Advertisement
Advertisement