బీఆర్‌ఎస్‌ అడ్రస్‌ గల్లంతు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ అడ్రస్‌ గల్లంతు

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

కొడంగల్‌: నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అడ్రస్‌ గల్లంతయిందని మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన పట్టణంలోని రేవంత్‌రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేవారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే రూ.10 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారని చెప్పారు. కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి సహకారంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అధిష్టానం మెప్పునకు అవాకులు చవాకులు పేతులున్నారన్నారు. లేని సమస్యలను ఉన్నట్లు సృష్టించి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం విద్య, వైద్యం, రహదారులకు తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మెడికల్‌ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, ఇంజనీరింగ్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, పారా మెడికల్‌ కళాశాల, స్కిల్‌ యూనివర్సిటీ, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, జూనియర్‌ కళాశాలలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంజూరు చేశారని గుర్తు చేశారు. కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రిని 220 పడకలకు విస్తరించి టీచింగ్‌ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారన్నారు. సోషల్‌, ట్రైబల్‌, మైనార్టీ, బీసీ వెల్ఫేర్‌ గురుకులాలకు అధునాతన వసతులతో కొత్త భవనాలు మంజూరు చేశారన్నారు. కొడంగల్‌–నారాయణపేట ఎత్తిపోతల పథకానికి జీవం పోశారని తెలిపారు. అనంతరం ఏఎంసీ చైర్మన్‌ అంబయ్య గౌడ్‌ మాట్లాడుతూ.. ఆరు లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేసినట్లు చెప్పారు. 12 లక్షల గన్నీ బ్యాగులను రైతులకు ఇచ్చినట్లు వివరించారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యుడు మహ్మద్‌ యూసూఫ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌ నాయక్‌, కౌన్సిలర్‌ హమీద్‌, కో ఆప్షన్‌ సభ్యులు రమేశ్‌బాబు, మునీర్‌, కాంగ్రెస్‌ నాయకులు సోమశేఖర్‌, దాము, ఆసీఫ్‌ఖాన్‌, చిన్న నందిగామ సర్పంచ్‌ దత్తాత్రేయరావు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ మొప్పుకోసం నరేందర్‌రెడ్డి లేని సమస్యలు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు

కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ప్రశాంత్‌ గుప్తా

Advertisement
 
Advertisement
Advertisement