సొసైటీ చైర్మన్‌కు ఎమ్మెల్యే పరామర్శ | - | Sakshi
Sakshi News home page

సొసైటీ చైర్మన్‌కు ఎమ్మెల్యే పరామర్శ

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

యాలాల: సొసైటీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డిని ఆదివారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పరామర్శించారు. ఇటీవల సురేందర్‌రెడ్డి కాలికి శస్త్రచికిత్స చేసుకున్న సంగతి విధితమే. ఈ మేరకు ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్‌ నర్సింహులు, మాజీ చైర్మన్‌ బాల్‌రెడ్డి, సంగెంకుర్దు మాజీ సర్పంచ్‌ హన్మంతు తదితరులు ఉన్నారు. కాగా.. సొసైటీ చైర్మన్‌ను ప్రభుత్వ చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావు ఉన్నారు.

పేదలకు వరం ‘ఇందిరమ్మ’

కొడంగల్‌: ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరమని మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌ అన్నారు. మండల పరిధి ప్యాలమద్ది, ఐనన్‌పల్లి గ్రామాల్లో పలువురు లబ్ధిదారుల ఇళ్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులు చైర్మన్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ అంబయ్య గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌ నాయక్‌, దాము, శ్రీనివాస్‌రెడ్డి, ఆసీఫ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

పట్టుదలతో ఏదైనా సాధ్యం

దోమ: దేశానికి సేవ చేసేందుకు అగ్నివీర్‌కు గ్రామం నుంచి ఏడుగురు ఎంపిక కావడం హర్షణీయమని సర్పంచ్‌ రజిత భాస్కర్‌గౌడ్‌ అన్నారు. మండల పరిధి ఐనాపూర్‌ నుంచిఆర్మీకి ఎంపికై న వారిని ఆదివారం శాలువాలు కప్పి సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ.. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని యువకులు నిరూపించారని తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటల్లో రాణించాలని, అప్పుడే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని సూచించారు.

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

తాండూరు టౌన్‌: విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన శనివారం మండల పరిధిలో చోటుచేసుకుంది. గోనూరు గ్రామానికి చెందిన మాల మాణిక్యప్పకుచెందిన ఎద్దు.. కోలి రామప్ప పొలంలో మేత మేస్తుండగా గాలితో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కరెంటు స్తంభాలకు ఉన్న విద్యుత్‌ తీగలు తెగి ఎద్దుపై పడటంతో షాక్‌తో అది అక్కడికక్కడే మృత్యువాత పడింది. సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ఎద్దు మృతితో నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు.

తాగునీటి సమస్యకు పరిష్కారం

బొంరాస్‌పేట: మండల పరిధి మేడిచెట్టుతండా సర్పంచ్‌ రవినాయక్‌ ఆధ్వర్యంలో 5వ వార్డు బోడబండతండాలో ఆదివారం తాగునీటి సమ స్య తీర్చేందుకు బోరు వేయించారు. పార్టీలకు అతీతంగా గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు చేస్తున్నామని సర్పంచ్‌ అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచు సోనారాజునాయక్‌, నాయకులు రమేశ్‌నాయక్‌, భాస్కర్‌, లక్ష్మణ్‌, రతన్‌, హన్మ్యా, సక్రియా, సేవ్యా, రుకాలిబాయి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement