తాండూరు టౌన్: విద్యార్థులు చదువుతో పాటు.. ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలని, అప్పుడే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు సుభాన్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కంప్యూటర్ మిషన్ ఆధ్వర్యంలో ఎఎస్ కంప్యూటర్స్ సాఫ్ట్ స్కిల్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ నూతన ఒరవడితో మార్పులు చెందుతోందన్నారు. ఇందుకు అనుగుణంగా విద్యార్థులు ఏఐ ఆధారిత కోర్సులపై దృష్టి సారించాలని సూచించారు. మిషన్‌ఆధ్వర్యంలో 150 మంది శిక్షణ పొందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఎస్ కంప్యూటర్స్ డైరెక్టర్ అన్నపూర్ణ, శిక్షకులు పద్మనాభ రెడ్డి, వివేకానంద, సంఘం కమిటీ సభ్యులు వీరభద్రప్ప, మహేశ్వర్ రెడ్డి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్తుకు పునాది
కుల్కచర్ల: పోటీ ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెంపొందిచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్‌ఐ రమేష్ అన్నారు. మండల కేంద్రంలోని కంప్యూటర్ కోచింగ్ సెంటర్‌లో కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఆదివారం సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. కాలాన్ని వృథా చేయకుండా.. భవిషత్తుపై దృష్టి సారించాలని సూచించారు. చదువుతో పాటు.. కంప్యూటర్ కోర్సుల్లో నైపుణ్యం సాధిస్తే.. ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వ్యక్తిత్వ వికాసం, జీవనోపాధి కల్పించే అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. క్షణిక సంతోషాలకు సమయం ఇవ్వరాదని చెప్పారు. టీయూడబ్ల్యూజే జాతీయ కార్యదర్శి శివకుమార్ గౌడ్, కేపీఎం కళాశాల ప్రిన్సిపాల్ విష్ణు, నిర్వహకులు సాయి భరత్, స్థానికులు వినోద్‌తదితరులు పాల్గొన్నారు.
చదువుతో పాటు
కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం: వక్తలు


