ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
నాడు జలకళ.. నేడు వెలవెల
వర్షాకాలంలో వరద పరవళ్లు తొక్కుతూ పంట పొలాలను ముంచెత్తిన ఈసీ వాగు ప్రస్తుతం ఎడారిగా దర్శనమిస్తోంది. మండలంలోని అమ్డాపూర్ సమీపంలో గల ఈసీవాగు పరివాహక ప్రాంతం వెలవెలబోయి కనిపిస్తూ చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
– మొయినాబాద్‌రూరల్
షాద్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో నాలుగు నెలల క్రితం మల్లన్న జాతరలో జరిగిన ఘటనలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. చిన్నారి తల్లిదండ్రులు గణేశ్, మౌనిక ఆదివారం షాద్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండేళ్ల చిన్నారి జాతరలో మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. చిన్నారి మృతిని కొన్ని పార్టీల నాయకులు రాజకీయం చేశారన్నారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేయకముందే కొందరు నాయకులు రాద్దాంతం చేశారే తప్పా ఎవరూ ఆదుకోలేదన్నారు. తాను అండగా ఉంటానని, తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని వారికి హామీనిచ్చారు.


