సంతోషంతో ఒత్తిడి దూరం | - | Sakshi
Sakshi News home page

సంతోషంతో ఒత్తిడి దూరం

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

చేవెళ్ల: సంతోషం, ఆనందకరమైన అలవాట్లు మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఒత్తిడిని సమర్థవంతంగా దూరం చేస్తాయని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేవర సమతారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ కళాశాల గ్రౌండ్‌లో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలతో కలిసి యోగ, వ్యాయామాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంతోషమే సగం బలం అనే మాట నిజం చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి యోగ, వ్యాయమాలు ఎంతో అవసరమన్నారు. దీంతో పాటు క్లీన్‌ చేవెళ్ల–గ్రీన్‌ చేవెళ్ల అనే నినాదంతో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ రాముగౌడ్‌, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, శైలజ, మనిషా, నాయకులు యాదిరెడ్డి, గోపాల్‌రెడ్డి, మున్సిపాల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమతారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement