వర్షం కురిసి.. అలా ముగిసి | - | Sakshi
Sakshi News home page

వర్షం కురిసి.. అలా ముగిసి

Jun 7 2026 9:18 AM | Updated on Jun 7 2026 9:18 AM

కాల్చితే నష్టం.. యాసంగి సీజన్‌ పంటల కోతలు పూర్తయ్యాయి. వానాకాలం సీజన్‌కు రైతులు సమాయత్తం అయ్యారు. ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్‌ శ్రీ 2026 10లోu

న్యూస్‌రీల్‌

పోలీసుల అదుపులో నిరసనకారులు

కాల్చితే నష్టం.. యాసంగి సీజన్‌ పంటల కోతలు పూర్తయ్యాయి. వానాకాలం సీజన్‌కు రైతులు సమాయత్తం అయ్యారు.

కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

సాక్షి, రంగారెడ్డి జిల్లా/తుర్కయంజాల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌ శంకుస్థాపన కార్యక్రమం శనివారం అకస్మాత్తుగా కురిసిన వర్షం.. ఆందోళనలు.. అరెస్టుల మధ్య ముగిసింది. కోహెడ కేంద్రంగా 239 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,284.32 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన మార్కెట్‌ భవనాలతో పాటు నాలుగు ఎకరాల్లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. సాయంత్రం ఐదు గంటలకే ఆయన హాజరు కావాల్సి ఉండగా, స్థానికంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నారాయణరెడ్డి, కాలె యాదయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిలుక మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పలువురు రైతులతో మాట్లాడి, వారి అనుభవాలను విన్నారు.

తడిసిన రైతులు.. ఖాళీ కుర్చీలు

పండ్లమార్కెట్‌ శంకుస్థాపనకు రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌, నల్లగొండ, నాగర్‌కర్నూలు, భువనగిరి జిల్లాల నుంచి సుమారు యాభై వేల మందిని తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు బస్సులను ఏర్పాటు చేశారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి రైతులు తడిపి ముద్దయ్యారు. శంకుస్థాపన ఆలస్యం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి మధ్యాహ్నం మూడు గంటలకే సభాస్థలికి చేరుకున్న రైతులు రాత్రి పొద్దుపోయే వరకు నిరీక్షించాల్సి వచ్చింది. మరికొంతమంది శంకుస్థాపనకు ముందే వెనుదిరిగారు. సభాస్థలి ముందు భాగంలో మూడు బ్లాకులు ఏర్పాటు చేయగా ఒకటి, రెండు బ్లాకుల్లో మాత్రమే జనం కనిపించారు. మూడో బ్లాక్‌లోని కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సరైన పార్కింగ్‌ లేకపోవడం, వర్షం కారణంగా వాహనాలు బురదలో ఇరుక్కుపోవడంతో వీటిని తీసేందుకు నానా తంటాలు పడ్డారు. కాగా, మల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన మద్దతుదారులు ప్లకార్డులు ప్రదర్శించగా ఎమ్మెల్యే వారిని వారించారు. నిశ్శబ్దంగా కూర్చోవాలని సూచించారు.

అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ఆలస్యంగా కార్యక్రమం

సభాస్థలికి రెండు గంటలు లేటుగా వచ్చిన ముఖ్యమంత్రి

శంకుస్థాపనకు ముందే వెనుతిరిగిన మెజార్టీ రైతులు

మరోవైపు కొనసాగిన ఆందోళనలు.. అరెస్టులు

రైతుల అంగీకారం లేకుండా, కనీస నష్టపరిహారం కూడా చెల్లించకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారని స్థానికులు, బాధితులు కొంతకాలంగా నిలదీస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సర్కారు తీరుపై అంతా గుర్రగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కార్యక్రమంలో అలజడి సృష్టించే అవకాశం ఉందని అనుమానించిన పోలీసులు భూ బాధిత రైతులతో పాటు పలువురు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. వీరిలో ఇద్దరు అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా ఉండటం గమనార్హం.

అరెస్టు చేసి, అటు ఇటు తిప్పి..

అరెస్టులను తప్పుబడుతూ కొంతమంది నిరసనకారులు కోహెడలో సీఎం రేవంత్‌రెడ్డి సహా స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దిష్టబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వానికి, సీఎంతో పాటు, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి, గంటల తరబడి రోడ్లపై తిప్పుతూ.. చివరకు నాగోల్‌ పీఎస్‌కు తరలించారు. పోలీసులు, సర్కారు తీరుపై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రైతుల అంగీకారం లేకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement