సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడిగా రఫియొద్దీన్‌ | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడిగా రఫియొద్దీన్‌

Jun 7 2026 9:18 AM | Updated on Jun 7 2026 9:18 AM

సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడిగా రఫియొద్దీన్‌

మర్పల్లి: సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడిగా రఫియొద్దీన్‌ (కొషేట్‌పల్లి)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ మద్దతుతో గెలుపొందిన ఆయా గ్రామాల సర్పంచ్‌లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లు సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షునిగా పోటీలో ఉన్నప్పటికీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఆదేశాల మేరకు కొంషేట్‌పల్లి సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రఫియొద్దీన్‌ మాట్లాడుతూ.. సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేశ్‌, పార్టీ జిల్లా నాయకులకు, సర్పంచ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా నాయకులు రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement