దోమ: మండల పరిధిలోని దాదాపూర్ పీఎంశ్రీ పాఠశాల విద్యార్థులు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షీప్(ఎన్‌ఎంఎంఎస్) టెస్ట్‌లో సత్తా చాటారు. రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి 8వ తరగతి విద్యార్థులకు నవంబర్‌లో జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి ప్రతిభ పరీక్షలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 62 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవ్వగా దాదాపూర్ పీఎంశ్రీ పాఠశాల నుంచి 11 మంది విద్యార్థులు సత్తాచాటారు. వీరికి ప్రభుత్వం 9వ తరగతి– 12వ తరగతి వరకు ఏటా రూ.12 వేల చొప్పున నగదు అందజేస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు.


