అనంతగిరి: గ్రామాలాభివృద్దికి ప్రణాళికతో ముందుకెళ్లాలని వికారాబాద్ ఎంపీడీఓ వినయ్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా వికారాబాద్ మండలంలోని అత్వెల్లిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రణాళికలో ఇచ్చిన అన్ని అంశాలను చేపట్టాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి, డీఎస్పీ అంజయ్య, సీఐ రఘుకుమార్, పంచాయతీ కార్యదర్శి పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ ఎంపీడీఓ వినయ్‌కుమార్


