యాలాల: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హాజీపూర్ మాజీ సర్పంచ్ ఒంగోనిబాయి శ్రీనివాస్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవితో కలిసి మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ నెల 21న జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రిని ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల పాత్ర ఎంతో ఉన్నతమైనదన్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 250 గజాల ఇళ్ల స్థలంతో పాటు పింఛను, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రత్యేక వెసలుబాటు కల్పించాలని కోరారు.


