ఫెర్టిలైజర్‌ దుకాణాలపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

ఫెర్టిలైజర్‌ దుకాణాలపై చర్యలు తీసుకోండి

Jun 6 2026 9:13 AM | Updated on Jun 6 2026 9:13 AM

పరిగి: రైతులను నిలువునా దోచుకుంటున్న ఫెర్టిలైజర్‌ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఈ మేరకు ఏఓ రజితకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో దుకాణదారులు పురుగు మందు, ఎరువులు, విత్తనాలు అధిక ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. షాపుల్లో స్టాక్‌ బోర్డులు, రసీలు ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, రైతు సంఘం నాయకులు నర్సింహులు, బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్‌

Advertisement
 
Advertisement
Advertisement