దోమ: జిల్లా నూతన డీఈఓగా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ ఘనీని టీజీఎచ్‌ఎంఏ (తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు) సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో మెరుగైన విద్య అందించడమే ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని డీఈఓ సూచించారు. బడిబాట కార్యక్రమాన్ని పకద్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో టీజీఎచ్‌ఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు నజీమొద్దీన్, జిల్లా అధ్యక్షుడు శంకర్, ప్రధాన కార్యదర్శి రూప్‌సింగ్, ఉపాధ్యక్షుడు బుద్దవేవ్, కార్యదర్శి మహేంద్ర బహుదూర్, సభ్యులు వెంకటయ్య, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


