సంక్షోభంలో సీసీఐ! | - | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో సీసీఐ!

Jun 5 2026 10:15 AM | Updated on Jun 5 2026 10:15 AM

సదుపాయాలు లేవు ప్రైవేటీకరణకు కుట్ర భూ కేటాయింపులు

ఉత్పత్తి, ఆదాయం ఇలా..

క్లింకర్‌, సిమెంట్‌ ఉత్పత్తి

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉత్పత్తి, మార్కెటింగ్‌ విషయంలో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ప్రైవేటు కంపెనీలతో పోటీపడలేక పోతోంది. నమ్మకానికి, మన్నికకు పేరొందిన ఈ కంపెనీ లాభాలు లేక వరుస నష్టాలను మూటగట్టుకుంటోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోలేక పోతోంది. తీవ్ర కాలుష్యంతో స్థానికుల అనారోగ్యానికి కారణమవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చర్యలకు వెనుకాడుతోంది.

సగానికి పడిపోయిన ఉత్పత్తి సామర్థ్యం

తాండూరు మండలం కరన్‌కోట్‌ కేంద్రంగా 2,389.98 ఎకరాల విసీ్త్రర్ణంలో 1987–88లో పది లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సగం ఉత్పత్తి కూడా చేయలేకపోవడమే కాకుండా బహిరంగ మార్కెట్‌లో విక్రయించలేకపోతోంది. ఫలితంగా ఏటా నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. అయితే దీనికి సమీపంలో వెలిసిన ఆదాని(బెల్కటూర్‌), సాగర్‌(కర్ణాకట, తెలంగాణ సరిహద్దు), ఆల్ట్రాటెక్‌(మల్కాపూర్‌), చెట్టినాడు(సంగెం) సిమెంట్‌ పరిశ్రమలు మాత్రం అనూహ్య లాభాలను చవిచూస్తున్నాయి.

ముడిపదార్థం పుష్కలం

సాధారణంగా సిమెంట్‌ తయారీలో లైమ్‌ స్టోన్‌, లేటరైట్‌, ఐరెన్‌ఓర్‌, జిప్సం, షెల్‌, ఫ్లై ఆష్‌, క్లింకర్‌, బర్‌ట్న్‌క్‌లై, ఇతర ముడి పదార్థాలను వినియోగిస్తుంటారు. రెండు రకాల (43,53 గ్రేడ్లు) సిమెంట్‌ ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు 53 స్పెషల్‌ గ్రేడ్‌ సిమెంట్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇందులో క్లింకర్‌ ప్రభుత్వ రైల్వే, బ్రిడ్జ్‌ల నిర్మాణాల్లో ఎక్కువ వినియోగిస్తుంటారు. సున్నపు రాయి(క్యాల్షియం), బంకమట్టి/షెల్‌(సిలికా, అల్యూమినియం, ఇనుము), ఇసుకను మిక్స్‌ చేస్తారు. 1,450 డిగ్రీల సెల్సియస్‌ వద్ద వేడి చేసి, చిన్న చిన్న ముద్ద(క్లింకర్‌)లుగా తయారు చేస్తారు. యూనిట్‌ పరిధిలో ముడిపదార్థాలు పుష్కలంగా ఉన్నప్పటికీ..ప్లాంట్‌ విస్తరణ జరగ లేదు.

ప్రాసెసింగ్‌ తీరు మారలే

అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని వినియోగించి, ఉత్పత్తి సామర్థ్యాన్నిపెంచు కోవడం, ధరల్లో వస్తున్న హెచ్చు, తగ్గులపై వెంటనే నిర్ణయాలు తీసుకోకపోవడం, ఽమార్కెటింగ్‌ను విస్తరింపజేయడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. అంతేకాదు నియామకాలను కూడా నిలిపివేసింది. 400 మంది ఉద్యోగులు పని చేసిన చోట..ప్రస్తుతం 160 మందితో నెట్టుకొస్తోంది. అంతేకాదు కంపెనీ కనీస సామజిక బాధ్యతను కూడా నిర్వర్తించడం లేదు. వర్కర్లు నివసించే ప్రదేశంలో కనీస సదుపాయాలను కూడా విస్మరిస్తోంది. స్థానికుల ఆరోగ్య భద్రతను గాలికొదిలేసింది.

ఇక్కడ 10 వేల మంది జనాభా ఉంటుంది. స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాల కూలీలు పని చేస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నా సదుపాయాలకు నోచుకోలేక పోతున్నాం. లారీల దుమ్ము, వ్యర్థాలతో ఈ ప్రాంతం పూర్తిగా కాలుష్యమైంది. ఇప్పటికే అనేక మంది శ్వాస సంబంధ సమస్యల బారినపడ్డారు.

– రాజ్‌కుమార్‌ సర్పంచ్‌, కరన్‌కోట్‌

సీసీఐ నష్టాలకు యాజమాన్య వైఖరే కారణం. ముడిపదార్థాలు పుష్కలంగా ఉన్నా.. ఉత్పత్తి సామర్థ్యం పెంచడం లేదు. మార్కెటింగ్‌లో ప్రైవేటుతో పోటీపడలేకపోతోంది. కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఉద్యోగులను వదిలించుకునేందుకు యత్నిస్తోంది. నష్టాల పేరుతో ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోంది.

– శరణప్ప తల్వార, సీసీఐ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ

యూనిట్‌ సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా

ప్రాంతం తాండూరు మండలం కరన్‌కోట్‌ రెవెన్యూ

ఉత్పత్తి ప్రారంభం 1987 జూలై 1

స్థాపిత సామర్థ్యం 10లక్షల మెట్రిక్‌ టన్నులు

కేటాయించిన భూమి 2,389.98 ఎకరాలు

ఫ్యాక్టరీ ఏర్పాటు 211.92 ఎకరాలు

మైనింగ్‌ కోసం 1,925.57 ఎకరాలు

టౌన్‌షిప్‌ 64.29 ఎకరాలు

రైల్వే లైన్‌ 173.28 ఎకరాలు

ఇతర అవసరాలకు 14.92 ఎకరాలు

ఉద్యోగులు 109 (ఎగ్జిక్యూటివ్స్‌–37, సూపర్‌ వైజర్స్‌–31, వర్కర్స్‌–41)

ప్రైవేటుతో పోటీపడలేక పోతున్న ప్రభుత్వ రంగ సంస్థ

ఏటా తగ్గుతున్న సిమెంట్‌ ఉత్పత్తి.. అమ్మకాలు

400 నుంచి 160 మందికి తగ్గిన సిబ్బంది

క్వార్టర్స్‌లో కనీస సదుపాయాలు కరువు

కాలుష్య కోరల్లో కరణ్‌కోట్‌ గ్రామ పంచాయతీ

అంశం 2022–23 2023–24 2024–25

ప్లాంట్‌ స్థాపిత సామర్థ్యం 10 ల.మె.ట 0 ల.మె.ట 10 ల.మె.ట

ఉత్పత్తి(లక్షల టన్నుల్లో) 5.82 5.90 4.27

ఉత్పత్తి విలువ(రూ.లక్షల్లో) 26,925 27,642 17,470

లాభం(రూ.లక్షల్లో) రూ.140 కోట్లు రూ.94 కోట్లు రూ.11.28 కోట్లు

అంశం 2023–24 2024–25

వినియోగ సామర్థ్యం 9.00 శాతం 42.73 శాతం

క్లింకర్‌ ప్రొడక్షన్‌ 5,81,360 మె.ట. 50,000 మె.ట.

సిమెంట్‌ ఉత్పత్తి 90,000 మె.ట. 27,270 మె.ట.

డిస్పాచ్‌ 5,89,720 మె.ట. 31,958 మె.ట.

Advertisement
 
Advertisement
Advertisement