నర్సింగ్‌ స్కూల్‌ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ స్కూల్‌ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం

Jun 5 2026 10:15 AM | Updated on Jun 5 2026 10:15 AM

మొయినాబాద్‌: షార్ట్‌ సర్క్యూట్‌తో నర్సింగ్‌ స్కూల్‌ హాస్టల్‌లో మంటలు అంటుకుని ఫర్నిచర్‌ కాలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. మున్సిపల్‌ కేంద్రంలోని కరున నర్సింగ్‌ స్కూల్‌ హాస్టల్‌ భవనంలో గురువారం ప్యానల్‌ బోర్డులో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో హాస్టల్‌ భవనంలో ఇద్దరే విద్యార్థులు ఉన్నారు. మంటలు ఎగిసి పడుతుండడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు పైపులతో నీళ్లు పట్టి మంటలు ఆర్పారు. అప్పటికే ప్యానల్‌ బోర్డు గదిలో ఉన్న ఫర్నిచర్‌తోపాటు ఇతర సామాగ్రి కాలిపోయాయి. ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement