బషీరాబాద్: మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) సూపర్‌వైజర్‌గా నవనీత గురువారం బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆమెను.. అధికారులు బషీరాబాద్‌కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా నవనీత మాట్లాడుతూ.. అక్రమ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కాశీంపూర్ సమీపంలో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మార్కెట్ కార్యదర్శి సిద్దమ్మ, సిబ్బంది శివ పాల్గొన్నారు.
మద్యం దుకాణంలో చోరీ
కొడంగల్ రూరల్: వైన్‌షాపులో దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని నాగ ఎల్లమ్మ వైన్ షాపును నిర్వాహకులు బుధవారం రాత్రి ఎప్పటిలాగే మూసివేశారు. అర్ధరాత్రి సమయంలో దుండగులు దుకాణం వెనుకభాగం నుంచి చొరబడి అందిన కాడికి అపహరించారు. గురువారం ఉదయం దుకాణం తెరిచిన నిర్వాహకులు.. సామగ్రి చిందరవందరగా పడుండటాన్ని గమనించి చోరీ జరిగిందని, రూ.50 వేల నగదుతో పాటు, రూ.10 వేల విలువ చేసే మద్యం సీసాలను అపహరించినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులు సమాచారం ఇవ్వగా.. క్లూస్ టీం వచ్చి పరిసరాలను పరిశీలించింది. వివరాలు సేకరించింది. వైన్స్ నిర్వాహకుడు రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ యాదయ్య తెలిపారు.


