బొంరాస్‌పేట: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ బుధవారం నుంచి ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను సరాఫరా చేశారు. మండలంలో 33 ప్రాథమిక, 11 ప్రాథమికోన్నత, 4 ఉన్నత పాఠశాలలున్నాయి. మొత్తం 46 ప్రభుత్వ పాఠశాలలకుగానూ 11,362 నోటు పుస్తకాలు అందాయని, అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలను అందజేస్తున్నట్లు ఎంఈఓ హరిలాల్ తెలిపారు. ఇందులో సీఆర్‌పీ సోమ్లా, ఎమ్మార్సీ సిబ్బంది గౌసోద్దీన్ తదితరులున్నారు.
విజయానికి పొంగిపోవద్దు
ధారూరు: విజయానికి పొంగి పోవద్దని, అపజయానికి బాధ పడొద్దని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముంగిపులో ఆయన విజేతలకు బుధవారం బహుమతులు ప్రదానం చేశారు. స్నేహభావంతో క్రీడలు ఆడాలని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీళగౌడ్, కో–ఆప్షన్ మాజీ సభ్యుడు హణఫీజ్, ఉప సర్పంచ్ జహంగీర్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్, నాయకులు నాగేష్‌గౌడ్, రహమతుల్లాఖాన్, భీంసేన్‌చారీ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మగౌరవాన్ని
దెబ్బతీస్తే ఖబడ్దార్
దౌల్తాబాద్: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఖబడ్దార్ అని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తెలంగాణ పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మండల కేంద్రంలో చౌరస్తాలో అంబేడ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో అన్నదమ్ముల్లా కలిసే ఉందామని, తెలంగాణ ఆత్మగౌరవంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు బంటురాజు, హన్మంతు, మహిపాల్, అమర్నాథ్, రెడ్యానాయక్, నరేందర్, కృష్ణ,భీములు, పాండు, మోహన్ నాయక్ ఉన్నారు.


