తాండూరు రూరల్: మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాల, హాస్టల్లో పని చేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని వార ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ వెంకటా చారికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాన్ టీచింగ్ సిబ్బంది మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్లో 2017 నుంచి నాన్ టీచింగ్(సెక్యూరిటీ, స్వీపింగ్, శానిటేషన్)లో పని చేస్తున్నామన్నారు. గతంలో ప్రిన్సిపాల్ ఖాతా నుంచి సిబ్బందికి వేతనాలు జమ చేసేవారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం టెండర్ ప్రక్రియ ద్వారా జీతాలు చెల్లించాలని భావిస్తోందని చెప్పారు. కావున వెంటనే టెండర్ విధానాన్ని రద్దు చేసి రెగ్యూలర్ ఉద్యోగుల మాదిరిగానే ఖాతాలో జీతాలు జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో వెంకన్ననాయక్, బాలకిషన్, బస్వరాజ్‌గౌడ్, విజయలక్ష్మి, హేమ, ఉషాలక్ష్మి, ఉమాదేవి, నాగలక్ష్మి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.


