బషీరాబాద్: బషీరాబాద్– కరణకోట్ ప్రధాన రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నాణ్యతను పట్టించుకోవడం లేదని వాహనదారులు, జీవన్గీ, క్యాద్గీరా, గంగ్వార్ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు తవ్వి ఎర్ర మట్టి పోసి, తొక్కించాల్సి ఉండగా, చెరువుల్లోని నల్లమట్టిని వేస్తున్నారు. దీనికి తోడు పాత బీటీని తవ్వి అదే మట్టిని కొత్తగా వేస్తున్న రోడ్డుకు వినియోగిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


