అనంతగిరి: ధాన్యం సేకరణకు రైస్ మిల్లర్లకు ఇచ్చిన లక్ష్యాలను అధిగమించాలని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో రైస్ మిల్లర్లు, లారీ ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి మిల్లరు 2 లక్షల 20 వేల బస్తాల ధాన్యాన్ని సేకరించాలని అన్నారు. జూన్ 6 నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కొనుగోలు కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు మిల్లులకు ధాన్యం తరలించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల జనరల్ మేనేజర్ అభిషేక్, డీజీఎం ఇర్ఫాన్, సూపరింటెండెంట్ ఇద్రీష్, పౌర సరఫరాల అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, జిల్లా సహకార అధికారి నాగార్జున, డీసీఎంఎస్ బ్రాంచ్ మేనేజర్ వెంకట్ రాంరెడ్డి, అదనపు డీఆర్‌డీఓ నర్సింలు, డీపీఎం కొమురయ్య, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు బాలేశ్వర్ గుప్తా, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి


