‘పాలమూరు’ను పట్టించుకోండి | - | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’ను పట్టించుకోండి

Jun 3 2026 6:42 AM | Updated on Jun 3 2026 6:42 AM

షాద్‌నగర్‌రూరల్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెలకొన్న సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవాలని జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటన నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహంవద్ద బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృద్ధిలో వెనుకబడి పోయిందని పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, కృష్ణా జలాల్లో జిల్లాకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటుచేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, షాద్‌నగర్‌ ప్రాంతంలో ప్రతిపాదిత పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టీజీ శ్రీనివాస్‌, రవీంద్రనాథ్‌, నర్సింలు, రామారావు, నర్సన్న, కృష్ణయ్య, నర్సింలుగౌడ్‌, తిరుమలయ్య, కృష్ణ, సత్యం, వెంకటేశ్‌, రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

నాటు సారా గుట్టురట్టు

రూ.40 వేల ముడి సరుకు స్వాధీనం

ఇద్దరిపై కేసు

బషీరాబాద్‌: మండలపరిధిలోని కొత్లాపూర్లోనాటు సారా తయారీకేంద్రంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేపట్టారు. ఎస్పీ స్నేహమెహ్రఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.కె.అన్వర్‌ పాషా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీ మొత్తంలో నాటు సారా తయారీ ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.కె. అన్వర్‌ పాషా తెలిపిన ప్రకారం. గ్రామానికి చెందిన రాథోడ్‌ రత్న్యా నాయక్‌ (56) ఇంటిపై దాడులు నిర్వహించగా రూ.12 వేల విలువైన 80 లీటర్ల ఐడీ లిక్కర్‌ ముడి పదార్థం, రూ.5,250 విలువైన 15 కిలోల నవసాగరం లభ్యమయ్యాయి. మొత్తం రూ.17,250 విలువైన సామగ్రిని పోలీసులు సీజ్‌ చేశారు.అదే గ్రామానికి చెందిన బాల్యా నాయక్‌ (38) నివాసంలో తనిఖీలుచేపట్టగా రూ.22,500 విలువైన 150 లీటర్ల ముడి పదార్థం, రూ.350 విలువైన ఒక కిలో నవసాగరం స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.22,850గా పోలీసులు పేర్కొన్నారు.రెండు దాడుల్లో కలిపి రూ.40,100 విలువైన నాటు సారా తయారీ ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి చర్యల నిమిత్తం బషీరాబాద్‌ ఠాణాకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement