బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే తాండూరుకు నిధులు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే తాండూరుకు నిధులు

Jun 3 2026 6:42 AM | Updated on Jun 3 2026 6:42 AM

తాండూరు: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ సందల్‌రాజ్‌ గౌడ్‌ అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి నివాసంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నై తెలంగాణ అన్నవారు ముఖ్యమంత్రి అయిండు.. నక్కో తెలంగాణ అన్నాయన ప్రధాని అయ్యాడని విమర్శించారు. రాష్ట్ర సాధనకు 14 ఏళ్లపాటు కేసీఆర్‌ పోరాటం చేశారన్నారు. తెలంగాణ తెచ్చింది ఎవరో గూగుల్‌, ఏఐలను అడిగితే కేసీఆర్‌ పేరు చెబుతాయన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలతో మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడలేదన్నారు. వానాకాలం సీజన్‌ వస్తున్న ఇప్పటి వరకు ఎరువులను అందుబాటులోకి తీసుకురాక పోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందన్నారు. పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్యేగా తాండూరు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. నాడు మంజూరైన నిధులకు సంబంధించి ఇప్పటి వరకు పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తాండూరు ప్రాంతానికి తీసుకొచ్చింది ఏమి లేదన్నారు. మరో రెండేళ్లు ఎమ్మెల్యేగా పదవి అనుభవించాలని.. తర్వాత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వచ్చేది లేదు.. గెలిచేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పట్లోళ్ల దీపానర్సింహులు, ఇర్షద్‌, జావీద్‌, మాజీ కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌, సీనియర్‌ నాయకులు శ్రీనివాసచారి, నర్సింలు, నరేందర్‌గౌడ్‌, వెంకట్‌రెడ్డి, సంతోశ్‌గౌడ్‌, సలీం తదితరులు పాల్గొన్నారు.

మనోహర్‌రెడ్డి తాండూరులో ఉండేది రెండేళ్లే..

జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ సందల్‌రాజ్‌ గౌడ్‌

Advertisement
 
Advertisement
Advertisement