షాద్‌నగర్: నేరాల నివారణకు పోలీసు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్‌జోషి సూచించారు. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అన్నారు. గ్రామాల్లో గస్తీని, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని చెప్పారు. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకొని, అంకిత భావంతో పని చేయాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని, క్రమ శిక్షణతో సమర్థవంతంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం, ఎస్‌ఐ పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు నిఘా అవసరం
కొత్తూరు: నేరాల నియంత్రణకు నిరంతర నిఘా కొనసాగించాలని ఫ్యూచర్‌సిటీ కమిషనర్ తరుణ్‌జోషి సూచించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా స్టేషన్ ఆవరణ, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల స్థితి, దర్యాప్తులో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించారు. అనంతరం సీఐ నర్సయ్యతో పాటు స్థానిక పోలీసులకు పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో షాద్‌నగర్ డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్‌జోషి


