అనంతగిరి: తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమే ఉద్యోగంగా పనిచేసిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ పశ్చిమ రంగారెడ్డి జిల్లా మాజీ చైర్మన్ కె.శ్రీనివాస్ కోరారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికారాబాద్‌లోని అమరుల స్తూపానికి నివాళి అర్పించేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచ్చేశారు. ఈమేరకు ఉద్యమకారులకు ప్రభుత్వ ఫలాలు అందజేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అధ్యక్షతన కమిటీ వేసి ప్రక్రియను మొదలుపెట్టినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ప్లాటు, పెన్షన్, గుర్తింపు కార్డు, ఉచిత విద్య, వైద్య సదుపాయాలు, ఆర్టీసీ, రైల్వేలో ఉచిత ప్రయాణ సౌకర్యం లాంటి ఫలాలు, రాజకీయంగా పదవుల్లో ప్రాధాన్యత ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, జేఏసీ నాయకులు సి.రమేశ్ కుమార్, ఎర్రవల్లి జాఫర్, నర్సింలు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, ఎమ్.సురేశ్, శివప్రసాద్, రవిశంకర్, కృష్ణారెడ్డి, దేవాదాస్, శివకుమార్ రెడ్డి, కృష్ణయ్య, సుభాశ్, కిషోర్, తిరుపతి రెడ్డి, బాలరాజు, మారుతి, అబ్దుల్ సమద్ దత్తు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ పశ్చిమ రంగారెడ్డి జిల్లా మాజీ చైర్మన్ శ్రీనివాస్


