ఏళ్ల కల.. పుష్కరమైంది నేడు | - | Sakshi
Sakshi News home page

ఏళ్ల కల.. పుష్కరమైంది నేడు

Jun 2 2026 7:40 AM | Updated on Jun 2 2026 7:40 AM

● కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమాలు ● కాంగ్రెస్‌ పాలనలో మూడోసారి

జిల్లాలోని 1,138 చెరువుల్లో మిషన్‌ కాకతీయ పథకం ద్వారా పూడిక తీసి మరమ్మతులు చేయించారు. కాంట్రాక్టర్ల చేతివాటంతో జిల్లాలో ఆశించిన ఫలితాలు రాలేదు.

గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో మూడు వేల పైచిలుకు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. వెయ్యి పైచిలుకు ఇళ్లు దాదాపు పూర్తి కావచ్చాయి. గడిచిన ఆరేళ్లలో పేదలకు ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు.

రాష్ట్ర రాజధాని నుంచి జిల్లాకు అనుసంధానించే బీజాపూర్‌ హైవే సుమారు రూ.వెయ్యి కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

రూ.940 కోట్లతో చేపట్టిన మహబూబ్‌నగర్‌–చించోలి హైవే పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.

సుమారు రూ.వెయ్యి కోట్ల నిధులతో పరిగి–వికారాబాద్‌, గడిసింగాపూర్‌–రంగారెడ్డిపల్లి, చిట్టెంపల్లిగేట్‌–లాల్‌పహాడ్‌, వికారాబాద్‌–తాండూరు తదితర రోడ్లు నాలుగు లైన్ల రహదారులుగా అభివృద్ధి చేస్తున్నారు. వీటితో పాటు అంతర్గత రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి.

దశాబ్దాలుగా అభివృద్దికి నోచుకోని కోట్‌పల్లి ప్రాజెక్టు రూ. 97 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.

తాండూరు రింగురోడ్డు పనులు, అనంతగిరిలో టూరిజం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

పరిగి మండలం కాళ్లాపూర్‌, రాపోల్‌ గ్రామాల మధ్య ఒకటి, దోమ మండలంలో రెండు, దుద్యాల మండలంలో ఒకటి మొత్తం నాలుగు పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.

ప్రతీ నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ గురుకుల పాఠశాలల సముదాయం మంజూరైంది.

వికారాబాద్‌–కృష్ణా రైల్వే లైన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.45 కోట్లతో భూ సేకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

కొడంగల్‌లో మెడికల్‌ కళాశాల, జనరల్‌ ఆస్పత్రి, ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల, అగ్రికల్చర్‌ వర్సిటీ, నర్సింగ్‌ కళాశాల తదితర విద్యా సంస్థలు మంజూరు కావటంతో పాటు నిర్మాణ దశలో ఉన్నాయి.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

వికారాబాద్‌: రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం వేడుకలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రం సిద్ధించాక తొమ్మిది సార్లు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించగా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మూడవ పర్యాయం నిర్వహించనున్నారు. పన్నెండేళ్ల కాలంలో జిల్లా ఏర్పాటుతో పాటు జిల్లాలో మనం సాధించిన ప్రగతి, కన్న కలలు ఏ మేరకు నెరవేరాయి.. ఇంకా ఏ మేరకు నెరవేరాల్సి ఉంది. అనే విషయాలపై రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ప్రత్యేక కథనం.

జిల్లా ఏర్పాటు కల సాకారం

మూడు దశాబ్దాలకు ముందు నుంచే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో పాటే ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ సైతం జిల్లా ప్రజల నుండి వ్యక్తమవుతూ వచ్చింది. రాష్ట్ర సాధన ఉద్యమానికి సమాంతరంగా వికారాబాద్‌ జిల్లా సాధన ఉద్యమం కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పశ్చిమ ప్రాంత వాసు లు చేపడుతూ వచ్చారు. ఉమ్మడి జిల్లా కార్యాలయలన్నీ హైదరాబాద్‌లో ఉండటం. జిల్లా వాసులకు అంతగా ప్రాధాన్యత దక్కకపోవటం. తూర్పు జిల్లా తో అనేక అంశాల్లో భావ సారుప్యత లేకపోవటం తదితర కారణాల నేపథ్యంలో ప్రత్యేక జిల్లా ఏర్పా టు ఉద్యమం బలపడుతూ వచ్చింది. చివరకు ప్రత్యేక రాష్ట్రం సిద్దించాక 2017లో తెలంగాణ ప్ర భుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకొన్న సమయంలో వికారాబాద్‌ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఆ కాంక్ష సాకారమైంది. అయితే జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాలు పూర్తికాగా ఇంకా చాలా వరకు ని ర్మాణ దశలో ఉన్నాయి.జిల్లాను పట్టి పీడిస్తున్న సా గునీటి ప్రాజెక్టుల కల మాత్రం ఇంకా నెరవేరలేదు.

రూ.3,700 కోట్ల నిధులతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌

జిల్లా కేంద్రంలో జిల్లా కార్యాలయాల(కలక్టరేట్‌) సముదాయం నూతన భవన నిర్మాణం, జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో పాటు అనుబంధంగా 250 పడకలతో జనరల్‌ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యచరణతో ఆయుష్‌ ఆస్పత్రి మంజూరు చేశారు. జిల్లా కేంద్రంలో రైల్వే ఫ్లై ఓవర్‌ మంజూరై నిర్మాణ దశలో ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అనంతగిరి ఎకో టూరిజం పార్కు మంజూరైంది. తాండూరుకు నర్సింగ్‌ కళాశాల మంజూరు చేశారు. జిల్లాలో మైనార్టీ,బీసీ,ఎస్సీ,ఎస్టీ బాలురు,బాలికలు కలుపుకొని మొత్తం 20 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయగా వాటికి భవనాలు నిర్మించాల్సి ఉంది.పరిగిలో వంద పడకల ప్రభుత్వఆస్పత్రి మంజూరైంది.మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీటి సరఫరా జరుగుతోంది. ఇటీవల కొడంగల్‌లో సుమారు రూ.3,700 కోట్ల నిధులతో సాగునీటి కోసం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం, వైద్య కళాశాల, వ్యవసాయ కళాశాల, ఇంజనీరింగ్‌ కళాశాల, ఇంటర్‌ కళాశాలలు, తదితర అభివృద్ధి పనులు నూతన ప్రభుత్వం మంజూరు చేసింది.జిల్లాలో 97 రైతు వేదికలు నిర్మించారు.ప్రతీ పంచాయతీలో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు.

నిర్మాణ దశలో అభివృద్ధి కార్యక్రమాలు

Advertisement
 
Advertisement
Advertisement