మరో 2వేల ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

మరో 2వేల ఇందిరమ్మ ఇళ్లు

Jun 2 2026 7:40 AM | Updated on Jun 2 2026 7:40 AM

పేదల సొంతింటి కలసాకారం

చేయడమే ప్రభుత్వ లక్ష్యం

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

పరిగి: పేదలకు సొంతింటి కల సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని గడిసింగాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం నియోజకవర్గానికి మరో 2వేల ఇళ్లు మంజూరు చేయనుందన్నారు. పదేళ్ల పాటు పాలన సాగించిన బీఆర్‌ఎస్‌తో ప్రజలకు చేకూరింది ఏమీ లేదన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రభుత్వ సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన వారికి అందేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమానికే పెద్దపీట

పూడూరు: పేదల సంక్షేమానికే కాంగ్రెస్‌ సర్కార్‌ పనిచేస్తోందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని మీర్జాపూర్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. అనంతరం గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులను అభినందించారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ.. సొంతింటి కల నెరవేర్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్‌ముదిరాజ్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ రఘునాథ్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శులు అజీంపటేల్‌, శ్రీనివాస్‌, శకీల్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

అయ్యప్ప ఆలయాభివృద్ధికి కృషి

కుల్కచర్ల: అయ్యప్పస్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని మైసగిరికొండపై ఉన్న అయ్యప్ప ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ అబివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆలయ ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేస్తా మన్నారు. టాయిలెట్స్‌, షెడ్స్‌, సీసీ రోడ్డు, కిచెన్‌ షెడ్డు తదితర పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మండల పరిధిలో బాధిత కుటంబాలకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రాంరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కనకం మొగులయ్య, బ్లాక్‌ బి అధ్యక్షుడు భరత్‌ కుమా ర్‌, ఆయా గ్రామాల సర్పంచులు, అయ్యప్పసేవా సమితి సంఘ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement