అనంతగిరి: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ వారోత్సవాల కార్యక్రమాలను ప్రారంభించారు. వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం నుంచి కోట్‌పల్లి రిజర్వాయర్ వరకు చేపట్టిన బైక్ ర్యాలీని అదనపు కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ శ్యాంకుమార్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ సుధీర్, సీఐ రఘుకుమార్, ఫారెస్టు అధికారులు శ్రీదేవి సరస్వతి, ప్రతిమా, నాగేశ్వరరావు, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పొగాకు ఉత్పత్తుల నివారణకు
చర్యలు అవసరం
పొగాకు ఉత్పత్తులు వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని తన కార్యాలయంలో డీఎల్‌సీసీ() సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత గుట్కాలాంటి వ్యసనాలకు అలవాటుపడి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. క్షయ, ఉబ్బసం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. జిల్లా అధికారులు వీటి నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్, డీఎంహెచ్‌ఓ పవిత్ర, ఎన్‌సీడీ అధికారిణి పద్మ ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


