అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు

Jun 2 2026 7:40 AM | Updated on Jun 2 2026 7:40 AM

● శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

అనంతగిరి: ప్రజా పాలనలో అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఆయన వికారాబాద్‌ మండల పరిధిలోని మదన్‌పల్లి, మైలార్‌దేవరాంపల్లి, గొట్టిముక్కుల, పులుసుమామిడి, కొటాలగుడెం గ్రామాల్లో రూ.3.02 కోట్లతో కూడిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికారాబాద్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు వేయించామన్నారు. రూ.650 కోట్లతో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్లు వేయిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట పేదల సొంతింటి కలను నిజం చేస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో సతమతమవుతూనే మరోపక్క అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ముదిరాజ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌టీఏ మెంబర్‌ ఎర్రవల్లి జాఫర్‌, ఎంపీడీఓ వినయ్‌కుమార్‌, ఎంపీఓ దయానంద్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు బిల్లపాటి విజయ లక్ష్మి, అనంతయ్య, శ్వేతా వేమారెడ్డి, సంగీత, ఇందిరమ్మ, సీనియర్‌ నాయకులు మైపాల్‌రెడ్డి, ప్రహ్లాద్‌రెడ్డి, మల్లేశం, శివయ్య, వేణుగోపాల్‌, కరుణాకర్‌రెడ్డి, పలువురు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement