అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి

Jun 2 2026 7:40 AM | Updated on Jun 2 2026 7:40 AM

తాండూరు: తాండూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి కలెక్టర్‌ దీపక్‌ తివారిని కోరారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ దీపక్‌ తివారి, అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌లతో పాటు పలువురు అధికారులతో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కలెక్టర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోళ్లలో సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వానాకాలం సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లా ఆస్పత్రితోపాటు ఎంసీహెచ్‌లో వైద్యుల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement