ధారూరు: మండల పరిధి కేరెళ్లిలో సత్యసాయి సార్వజనిక కేంద్రంలో ఏప్రిల్ 24 నుంచి నిర్వహించిన వేసవి బాలవికాస్ వేసవి శిక్షణ శిబిరం సోమవారంతో ముగిసింది. 130 మంది బాలబాలికలు శిక్షణ పొందారు. కార్యక్రమంలో చిన్నారులకు తెలుగు రాయడం, ఇంగ్లిష్‌లో మాట్లాడటం, క్రీడల్లో శిక్షణ, గణితం, కంప్యూటర్ బేసిక్స్, సాంస్కృతిక, కాలిగ్రఫిలో తర్ఫీదునిచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌సింగ్ ఠాగూర్, రాష్ట్ర లిఖిత నామావళి సమన్వయకర్త జగన్నాథరావు, కేరెళ్లిశాఖ అధ్యక్షుడు రఘునందన్, ప్రధాన కార్యదర్శి ప్రేంకుమార్, కన్వీనర్లు వీరేశం, రామకృష్ణారెడ్డి, నాగరాజులు, పదాధికారులు, సేవాదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


