దుద్యాల్: దేశ సేవే చేసేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమని సినీ నటుడు, బాహుబలి ఫేం కాలేకయ ప్రభాకర్ అన్నారు. మండల పరిధిలోని హస్నాబాద్ నుంచి అగ్నివీర్‌లుగా ఎంపికై న సాయితేజ, అశోక్, రాకేశ్, నవీన్, హన్మంత్‌ను సోమవారం ఆయన గ్రామస్తులతో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే గ్రామంలో వంద మందికి పైగా దేశ సేవలో ఉన్నారని యువత వీరి స్ఫూర్తితో మరింత మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దౌల్తాబాద్ మల్లేశ్, గ్రామస్తులు ఆంజనేయులు, నర్సింలు, గోవర్ధన్, నరేశ్, రాజు, శ్రీశైలం, రమేశ్, సుధాకర్, వినోద్, మైపాల్ రెడ్డి, శంషీర్ తదితరులు ఉన్నారు.


