పేదలకు వరం ‘ఇందిరమ్మ’ | - | Sakshi
Sakshi News home page

పేదలకు వరం ‘ఇందిరమ్మ’

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

కొడంగల్‌ రూరల్‌: పేదలకు వరం ఇందిరమ్మ ఇళ్లు అని మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌ కుమార్‌ అన్నారు. సోమవారం మండల పరిధి పెద్దనందిగామలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ అనిత, సర్పంచ్‌ చన్‌బస్‌కుమార్‌, హౌజింగ్‌ శాఖ అధికారులతో కలిసి ఐదుగురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అర్హులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అందిరికీ లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. మాజీ సర్పంచ్‌ సంజీవరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి, ఆనంద్‌రెడ్డి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

పంట నమోదు తప్పనిసరి

తాండూరు రూరల్‌: రైతులు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవాలని ఎంపీడీఓ విశ్వప్రసాద్‌ అన్నారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో జీపీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫార్మర్‌ రిజిసీ్ట్ర చేయడంలో పంచాయతీ కార్యదర్శులు భాగస్వామ్యం ఉందన్నారు. ఆయా గ్రామాలకు ఏఈఓలు వస్తున్న క్రమంలో చాటింపు వేసి, పంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. పంట నమోదుపై అవగాహన కల్పించాలని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని, లేని పక్షంలో రాయితీలు అందవని చెప్పారు. సర్‌ మ్యాపింగ్‌లో బీఎల్‌ఓలకు సహకరించాలని చెప్పారు.

ప్రజావాణికి ఒక్క దరఖాస్తు

బంట్వారం: మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఒక్క దరఖాస్తు వచ్చింది. ఏమైనా సమస్యలు ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకోవాలని ఎంపీడీఓ రాములు ప్రజలకు సూచించారు.

అందుబాటులో జనుము విత్తనాలు

తాండూరు రూరల్‌: రైతులకు అందుబాటులో జనుము విత్తనాలు ఉన్నాయని పెద్దేముల్‌మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్‌ ప్రీతం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 కిలోల బస్తా రూ.3,110 ధర ఉందన్నారు. బస్తా జనుము 2.5 ఎకరాలకు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు.. పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కార్డు, ఫోన్‌ నంబర్‌తో ఏఈఓలను సంప్రదించాలని సూచించారు.

ఏడీఏగా అరుణ

తాండూరు రూరల్‌: వ్యవసాయ శాఖ తాండూరు డివిజన్‌ ఏడీఏగా కె.అరుణ నియమితులయ్యారు. సాధారణ బదిలీల్లో భాగంగానిజామాబాద్‌ జిల్లా బాన్సువాడలో పనిచేస్తున్న ఆమె.. ఇక్కడి వచ్చారు. గతంలో ఇక్కడపనిచేసిన ఏడీఏ రుద్రమూర్తి.. 11 నెలల క్రితం పదోన్నతి పొంది.. వెళ్లిపోయారు. ఆయన స్థానంలో నాటినుంచి మండల వ్యవసాయ శాఖ అధికారి కొమురయ్య ఇన్‌చార్జి ఏడీఏగా కొనసాగారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఆరుణ మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement