‘ఉపాధి’.. కూలీలకు జీవనోపాధి | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’.. కూలీలకు జీవనోపాధి

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

జోరుగా కొనసాగుతున్న పనులు జాతరను తలపిస్తున్న పనిప్రదేశాలు

దుద్యాల్‌: గ్రామాల్లో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. నాలుగు గంటల పని సమయం కావడంతో అర్హులందరూ మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో.. ఉపాధి పనులు కూలీలకు ఆదాయ వనరుగా మారింది. జాబు కార్డు కలిగిన వారందరికీ ప్రభుత్వం పని కల్పించడం, సకాలంలో వేతన బకాయిలు చెల్లిస్తుండటంతో కూలీల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీంతో పనుల ప్రదేశంలో జాతరను తలపిస్తోంది. చెరువుల్లో వండ్రును తీయడం, చేపల పెంపకానికి గుంతలు తొవ్వడం తదితర పనులు జోరుగా సాగుతున్నాయి. అదే విధంగా చెరువుల నుంచి పంట పొలాలకు మట్టితరలింపు, నీటి కాల్వల పూడిక తీత, ముళ్ల పొదళ్లను తొలగించడం తదితర పనులు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement