‘ఎమ్మెల్యే ప్రతిపాదించిన వారికే మా మద్దతు’ | - | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్యే ప్రతిపాదించిన వారికే మా మద్దతు’

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

యాలాల: నామినేటెడ్‌ పోస్టుల కేటాయింపుల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సూచించిన వ్యక్తికే తమ మద్దతు, సహకారం ఉంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పేర్కొన్నారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. యాలాల సొసైటీ చైర్మన్‌ పదవిని కాంగ్రెస్‌ బీ–బ్లాక్‌ అధ్యక్షుడు, సీనియర్‌ నాయకుడు చెన్నారం అనిల్‌కుమార్‌గుప్తా పేరును ఎమ్మెల్యే సిఫార్సు చేశారని.. ఎమ్మెల్యే సూచించిన నాయకుడికే తాము మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మహిపాల్‌, మాజీ అధ్యక్షుడు గురురాజ్‌ జోషి, బీమప్ప తదితరులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చెన్నారం మల్లయ్య, ముకుందాపూర్‌ సాయిలు, నర్సింలు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement