విద్యుదాఘాతంతో పశువుల మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో పశువుల మృతి

Jun 1 2026 7:35 AM | Updated on Jun 1 2026 7:35 AM

మొయినాబాద్‌రూరల్‌: విద్యుదాఘాతంతో మూడు దూడలు, ట్రాక్టర్‌, పశువుల మేత దగ్ధమైన సంఘటన మండలంలోని చందానగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. చందానగర్‌ గ్రామానికి చెందిన రాజేష్‌ పశువుల పాకలో మధ్యాహ్నం ట్రాక్టర్‌, పశువులకు వేసే సొప్ప కరెంటు షాక్‌తో దగ్ధమైంది. ఎండలు జోరుగా ఉండడంతో మూడు దూడలు సజీవంగా దహనం అయ్యాయి. అదే విధంగా పాలిచ్చే గేదెలు, ఆవులకు సైతం తీవ్రంగా గాయపడ్డాయి. దాదాపు రూ.20–22 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులతో పాటు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement