పరిగి: నిరంతరం విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు తమ కార్యాలయానికి తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది. పట్టణ కేంద్రం తుంకుల్‌గడ్డలోని ఎకై ్సజ్ కార్యాలయానికి ఆదివారం మధ్యాహ్నం తాళం వేసి ఉండటంతో.. వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ఇబ్బంది పడ్డారు. అధికారులకు ఫోన్ చేయగా.. పొంతన లేని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేయడమే కాకుండా.. సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి, ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయమైఎకై ్సజ్ సీఐ నీరజాదేవిని వివరణ కోరగా.. విధుల్లో సిబ్బంది ఉన్నారని, ఏదైనా పని ఉంటే బయటకు వెళ్లిఉండవచ్చని పేర్కొన్నారు.


