ముగిసిన జాతర | - | Sakshi
Sakshi News home page

ముగిసిన జాతర

Jun 1 2026 7:35 AM | Updated on Jun 1 2026 7:35 AM

తాండూరు రూరల్‌: నెల రోజులుగా కొత్లాపూర్‌ శివారులో కొనసాగిన రేణుకా ఎల్లమ్మ జాతర ఆదివారంతో ముగిసింది. మే 1వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలకు ప్రతీ మంగళ, శుక్రవారాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి జిల్లా వాసులతో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చి తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మే 15న రథోత్సవం, సిడే కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. చివరి రోజు ఆదివారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. జాతరకు సహకరించిన ప్రతీ ఒక్కరికి పాలకవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ప్రతీ పౌర్ణమి, అమా వాస్యకు ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ పట్లోళ్ల ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ శేఖర్‌ గౌడ్‌, ఆలయ కమిటీ డైరెక్టర్లు సుజాత, నర్సింలు, పుఠ్యానాయక్‌, రాజుగౌడ్‌, రాజు, లక్ష్మి, నిర్వాహకు లు సాయిలు, వెంకట్‌రెడ్డి, రాజు, శంషొద్దీన్‌, రేణు క, రవి, పూజారి శ్రీనివాస్‌ పంతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement