అల్లనేరేడు.. లాభాలు బోలెడు | - | Sakshi
Sakshi News home page

అల్లనేరేడు.. లాభాలు బోలెడు

Jun 1 2026 7:29 AM | Updated on Jun 1 2026 7:29 AM

అల్లనేరేడు.. లాభాలు బోలెడు

వేసవిలో విరివిగా లభించే పండ్లు

పలు రకాల వ్యాధులు దూరం

మార్కెట్‌లో మంచి డిమాండ్‌

షాబాద్‌: తియ్యదనం, పులుపు, వగరు మేలు కలయికే అల్లనేరేడు పండ్లు. నల్లగా నిగనిగలాడే పండ్లను చూస్తే ఎవరికై నా నోరూరాల్సిందే. సహజసిద్ధంగా లభించే వాటిలో అల్లనేరేడు పండ్లు ఒకటి. ప్రకృతిలో లభించే పండ్లు ఎన్ని ఉన్నా సరే సినీ, జానపద గేయ రచయితలు మాత్రం అల్లనేరేడు పండ్లపై పాటల రూపంలో బాణీలు కట్టడం విశేషం.

ఆరోగ్య ప్రయోజనాలు

● ఎర్ర రక్త కణాలు వృద్ధి చెంది ఆరోగ్యంగా ఉండేందుకు నేరేడు పండ్లు ఎంతో ఉపయోగపడుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు. మధుమేహం ఉన్నవాళ్లకు ఇవి చాలా మంచివి.

● మూత్ర సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు ఈ పండ్లు తింటే ఉపశమనం లభిస్తుంది.

● గర్భిణులు తింటే తల్లి, బిడ్డకు చాలా మంచిది. దీని వల్ల మెదడు చురుగ్గా ఉండటంతో పాటు హార్ట్‌ బీట్‌ చక్కగా ఉండేందుకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది.

● నేరేడులో విటమిన్‌ సీ, ఏ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కంటి సమస్యలు, నొప్పులను నివారించడంలో సహాయపడుతుంది.

● క్యాల్షియం, పొటాషియం. ఐరన్‌, విటమిన్‌ సీ అధిక మోతాదులో ఉండడంతో రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.

● ఈ నేరేడు చెట్టు ఆకులను దంచి కషాయంగా కాచి నోట్లో వేసుకొని పుక్కిలిస్తే దంత, చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.

● నేరేడు పండ్లకు రక్తాన్ని శుద్ధి చేసే గుణంతో పాటు పండ్ల రసాన్ని నిమ్మరసంతో కలిపి గాయాలున్న చోట పూస్తే గాయాలు త్వరగా మానుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement