గడువు పెంచాలి
ఇబ్బందులు పడుతున్నాం
పరిగి: విద్యాశాఖలో సర్వీస్ రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించకపోవడం ఉపాధ్యాయులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. ప్రభుత్వం అన్ని శాఖల ఉద్యోగుల వివరాలను డిజిటలైజేషన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విద్యాశాఖలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. వివరాల నమోదుకు మే 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. అయితే ఉపాధ్యాయుల ఎస్‌ఆర్‌లో కీలకమైన ఎంట్రీలు అసలు లేకపోవడం, కొన్ని చోట్ల నామమాత్రంగా నమోదు చేయడం, ఇంకొన్ని చోట్ల తప్పుల తడకగా ఉండటం సమస్యగా మారింది.
నమోదు కాని వివరాలు
జిల్లాలో 20 మండలాలు.. 1,063 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 4,500 మంది వరకు ఎస్జీటీ, ఎస్‌ఏ, జీహెచ్‌ఎంలు విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్ అనేది వారి జీవన రేఖ లాంటింది. అదే సక్రమంగా లేకపోతే వారి పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఏటా సర్వీస్ రిజిస్టర్ నమోదు చేయాల్సిన అధికారులు వాటిపై ఇంకు కూడా పెట్టకపోడం ఉపాధ్యాయులకు సమస్య తెచ్చి పెట్టింది. 2008 నుంచి ఎంట్రీలు సక్రమంగా లేక తంటాలు పడుతున్నారు. నాటి నుంచి నేటి వరకు టీచర్లు అనేక చోట్లకు బదిలీ అయ్యారు. గతంలో పనిచేసిన చోటరికార్డులు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఎస్‌ఆర్ ఎంట్రీలు చేయాల్సిన డీడీఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది.
తలనొప్పిగా మారిన ప్రక్రియ
ఉపాధ్యాయులకు ఒకవైపు జనగణన విధులు, మరో పక్క బడిబాట కార్యక్రమం ఉన్నందున డిజిటలైజేషన్ ప్రక్రియ తలనొప్పిగా మారింది. ఇలాంటి తరుణంలో ఎస్‌ఆర్ నమోదు ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఏటా తీసుకునే ఆన్యువల్ గ్రేడ్, ఇంక్రిమెంట్, ఈఎల్‌ఎస్.. ఇలా ప్రతి విషయాన్ని రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాలో కనిపించడం లేదు. దీంతో అప్పుట్లో విధులు నిర్వహించిన డీడీఓలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ఎంట్రీలు చేయించుకుంటున్నారు.
రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడమే కారణం
నేటితో ముగియనున్న డిజిటలైజేషన్ ప్రక్రియ
ఇంకా పూర్తికాని ఎంట్రీలు
గడువు పెంచాలని వినతులు
డిజిటలైజేషన్ గడువు పెంచాలి. సర్వీస్ రిజిస్టర్ల నమోదు ఇంత వరకు పూర్తి కాలేదు. డీడీఓలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. రిజిస్టర్లన్నీ అంపూర్తిగానే ఉన్నాయి. వాటి నమోదుకు కొంత సమయం కావాలి.
– శ్రీశైలం, ఉపాధ్యాయుడు, కుల్కచర్ల
2012లో టీచర్ పోస్టు సాఽ దించా. అప్పటి నుంచి ఇ ప్ప టి వరకు రెండు మండలాల్లో పని చేశా. అప్పట్లో క్ల స్టర్ హెచ్‌ఎంగా ఉన్న అధి కారి బదిలీపై వెళ్లారు. దీంతో సర్వీస్ రిజిస్టర్‌లో ఎంట్రీలు నమోదు కాలేదు. సరి చేయాలంటే బదిలీపై వెళ్లిన అధికారి వద్దకు వెళ్లాల్సి ఉంది.
– శ్రీనివాస్, ఎస్జీటీ, చెల్లాపూర్


