కిరాణ షాపుల్లో పోలీసుల సోదాలు | - | Sakshi
Sakshi News home page

కిరాణ షాపుల్లో పోలీసుల సోదాలు

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

కిరాణ షాపుల్లో పోలీసుల సోదాలు

మొయినాబాద్‌: మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్‌, జీవన్‌గూడలో శనివారం రాత్రి డాగ్‌స్క్వాడ్‌ బృందంతో కలిసి మొయినాబాద్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని కిరాణ, పాన్‌ షాపుల్లో సోదాలు చేశారు. నేర నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలనతోపాటు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. అనుమానాస్పద ప్రాంతాల్లో విసృతంగా తనిఖీలు చేసి మాదక ద్రవ్యాలు, గంజాయి, నిషేధిత పొగాకు ఉత్పత్తులు, చట్ట విరుద్ధ వస్తువుల విక్రయం, నిల్వ, రవాణాపై ప్రజలు, దుకాణదారులకు అవగాహన కల్పించామన్నారు. తనిఖీల్లో ఎస్సై కిషన్‌ సింగ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement