అనంతగిరి: మున్సిపల్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం వికారాబాద్‌లో మున్సిపల్ కార్మికులతో కలిసి సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎనిమిది గంటల పనివిధానం కొనసాగించాలని, కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రతిఒక్కరికీ రూ.20 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్‌నాయక్, బుచ్చయ్య, జ్యోతి, జాఫర్, రవి, మంగమ్మ, లక్ష్మమ్మ, శివకుమార్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నిరసన
ఎనిమిది గంటల పని విధానం కొనసాగించాలని నినాదాలు


