హుండీ అక్రమాల కేసులో ఇద్దరికి జైలు | - | Sakshi
Sakshi News home page

హుండీ అక్రమాల కేసులో ఇద్దరికి జైలు

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

దుద్యాల్‌: మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపులో అక్రమాలకు పాల్పడిన ఈఓ రాజేందర్‌రెడ్డితోపాటు సహకరించిన అతని స్నేహితుడు విజయ్‌ని శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాండూరు కోర్టులో జడ్జి ముందు హాజరు పరిచి పరిగి జైలుకు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ శ్రీశైలం వెల్లడించారు. హుండీ ఆదాయం లెక్కింపులో అవకతవకలు జరిగినట్లు ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టారు. రూ.41,500 కాజేసినట్లు ఈఓ ఒప్పుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ వ్యవహారంలో రాజేందర్‌రెడ్డికి సహకరించిన అతని స్నేహితుడు విజయ్‌ను కూడా అరెస్ట్‌ చేసి జైలుకు పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆలయ ఈఓ రాజేందర్‌తోపాటు సహకరించిన విజయ్‌ అరెస్ట్‌

పరిగి జైలుకు తరలింపు

Advertisement
 
Advertisement
Advertisement