పరిగి: భూ సేకరణ సమయంలో రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం రాపోల్, కాండ్లాపూర్ గ్రామాల్లో రైతులు చేపట్టిన నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. రియల్ ఎస్టేట్ కోసం రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరిస్తున్నారని ఆరోపించారు. రాకంచర్ల, నంచర్ల ప్రాంతంలో ఖాళీగా ఉన్న భూములను తీసుకోకుండా, పంట పొలాలను తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు అంగీకరిస్తేనే భూములు తీసుకోవాలని సూచించారు. బలవంతంగా తీసుకోవాలని చూస్తే వారి పక్షాన నిలబడి ఉద్యమాలు, పోరాటం చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి


