బంట్వారం: కాంగ్రెస్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎం కృష్ణారెడ్డి నియమితులయ్యారు. సోమవారం ఆయన నగరంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తనకు అప్పగించిన పదవికి వన్నె తెచ్చేలా పని చేస్తాన పేర్కొన్నారు.
రేపు తాండూరులో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్
తాండూరు టౌన్: పట్టణంలోని పాత శాలివాహన కళాశాల మైదానంలో బుధవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు ఆ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాము, మధు సోమవా రం ఓ ప్రకటనలో తెలిపారు. 20 ఏళ్ల లోపు బాలబాలికలు ఎస్సెస్సీ మెమో, కుల ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు మైదానానికి రావాలన్నారు. 100, 200, 400, 800, 1500, 3వేలు, 5వేల మీటర్ల రన్నింగ్ పోటీలు, షాట్‌పుట్, లాంగ్ జంప్‌లో సెలక్షన్స్ ఉంటాయన్నారు. వివరాలకు సెల్ నంబర్ల 9951343432, 6300075229లో సంప్రదించాలన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 11న వరంగల్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.


