పార్టీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు
కుల్కచర్ల: దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న ఏకై క పార్టీ బీజేపీయేనని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు అన్నారు. సోమవారం కుల్కచర్లలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం మెచ్చిన నేత మోదీ అన్నారు. అవినీతి రహిత పాలన బీజేపీతో సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జి.వెంకటయ్య, సర్పంచ్ అంజిలయ్య, చాపలగూడెం సర్పంచ్ స్వప్న, దిశ కమిటీ జిల్లా సభ్యులు జానకీరాం చౌహాన్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్యారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు అంజిలయ్య, మైపాల్, చంద్రలింగం, నాయకులు పాండురంగాచారి, కర్ణయ్య, రాజు, వెంకట్, రాంచంద్రయ్య, మహేశ్, రాములు, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


