దుద్యాల్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని హకీంపేట్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కుల్కచర్ల మండలం కామన్‌పల్లి గ్రామానికి చెందిన ఒగ్గుడోలు కళాకారులు కృష్ణయ్య, మల్లయ్య, అంజిలయ్య హకీంపేట్‌లో కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో వారు బైక్ కింద పడింది. దీంతో ముగ్గురూ గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబీకులు వేరు ప్రాంతాలకు తీసుకెళ్లారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేయడంతోనే ప్రమాదం జరిగిందని, అధికారులు స్పందించి సీసీరోడ్డు పనులు పూర్తి చేయించాలని పలువురు కోరారు.


