
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం
కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు
కుల్కచర్ల: సీఎంఆర్‌ఎఫ్.. పేదలకు వరమని కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. మండల పరిధిలోని ముజాహిద్‌పూర్ గ్రామంలో పలు తండాల బాధితులకు మంజూరైన చెక్కులను సోమవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు ముదిరాజ్ మాట్లాడుతూ.. అర్హులైన బాధితులు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, అంబు, రాజు, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ సిలిండర్ల కోసం ధర్నా
కుల్కచర్ల: భారత్ గ్యాస్ సిలిండర్లు సమయానికి సరఫరా చేయడం లేదని వినియోగదారులు సోమవారం ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని వినియోగదారులు భారత్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం వద్ద ఉదయం నుంచి సిలిండర్ల కోసం నిరీక్షించారు. ఏజెన్సీ నిర్వాహకులు స్పందించకపోవడంతో పరిగి–మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు, పోలీసులు వారికి సర్దిచెప్పి సిలిండర్లను అందజేశారు. ముందస్తు బుకింగ్ లేకుండా కార్యాలయం వద్దకు రావడంతో సమస్య తలెత్తిందని నిర్వాహకులు చెబుతున్నారు. సిలిండర్ల కోసం ఒకరోజు ముందుగానే బుక్ చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
అంగన్‌వాడీ సిబ్బందికి
చీరల పంపిణీ
కొడంగల్ రూరల్: పట్టణంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గామాత సన్నిధిలో సోమవారం అంగన్‌వాడీ సిబ్బందికి, ఆశ కార్యకర్తలకు మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్.జగదీశ్వర్‌రెడ్డి చీరలు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు అమ్మవారి సన్నిధిలో ముత్తైదువులతో కుంకుమ, పసుపు(పసుపు బొట్టు) అందిస్తూ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు లక్ష్మీనారాయణగుప్తా తదితరులు పాల్గొన్నారు.
బెన్నూరులో కూలిన ఇల్లు
యాలాల: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని బెన్నూరు గ్రామానికి చెందిన మాల అమృతమ్మకు చెందిన ఇల్లు కూలింది. పైకప్పు తోపాటు బయటి గోడలు బీటలు వారాయి. దీంతో అమృతమ్మ భయాందోళన వ్యక్తం చేసింది. తమకు ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరింది.

సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం

సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం

సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం