
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
అనంతగిరి: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ.. పెండింగ్ వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు పండుగ పూట కూడా పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కల్పించుకుని పెండింగ్‌లో ఉన్న వేతనాలు మంగళవారం వరకు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు గోవర్ధన్, తుకారాం, మహేందర్, ఊషయ్య, శ్రీనివాస్, నర్సమ్మ, రవికుమార్, రామకృష్ణ, లక్ష్మయ్య, యాదయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్